News January 26, 2025
పేకాట స్థావరంపై దాడి.. ఇద్దరు అరెస్ట్

ద్వారకాతిరుమల మండలం, లైన్ గోపాలపురంలోని ఓ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ద్వారకాతిరుమల ఎస్ఐ టి.సుధీర్ సిబ్బందితో కలిసి శనివారం దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 20,500 ల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. పేకాట, కోడిపందేలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్ఐ హెచ్చరించారు.
Similar News
News February 26, 2026
MBNR: రాజకీయాలను కుదిపేస్తున్న కుమ్మెర ఘటన

కుమ్మెరలో మల్లన్న జాతర సందర్భంగా తలెత్తిన వివాదం రెండు కులాల మధ్య పంచాయితీగా మారింది. తన రెండు నెలల కుమార్తెను రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు కాలితో తన్నడంతో చనిపోయిందని రజక కులానికి చెందిన చిలికేశ్వరం గణేశ్, మౌనిక దంపతులు ఆరోపిస్తున్నారు. రజక కులానికి చెందిన కుటుంబంపై రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు చేసిన దాడిలో 2 నెలల పసికందు చనిపోయిందనే వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.
News February 26, 2026
సరైన నిద్రలేకపోతే అందానికి దెబ్బ

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ నిద్రలేమి వేధిస్తోంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది అందాన్నీ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేకపోతే శరీరం పీహెచ్ దెబ్బతిని చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దీంతో వయసు పైబడినట్లు కనిపిస్తారు. అలాగే డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు, ముడతలు, జుట్టు రాలిపోవడం వంటివి కూడా వస్తాయని చెబుతున్నారు.
News February 26, 2026
నిర్మల్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు సర్వం సిద్ధం

జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DIEO) పరుశురాం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6,473 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, వారి కోసం 23 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.


