News January 26, 2025
పేకాట స్థావరంపై దాడి.. ఇద్దరు అరెస్ట్

ద్వారకాతిరుమల మండలం, లైన్ గోపాలపురంలోని ఓ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ద్వారకాతిరుమల ఎస్‌ఐ టి.సుధీర్ సిబ్బందితో కలిసి శనివారం దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 20,500 ల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. పేకాట, కోడిపందేలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్‌ఐ హెచ్చరించారు.
Similar News
News February 17, 2025
నేడు తిరుపతిలో దేవాలయాల సమ్మిట్.. ముగ్గురు సీఎంల హాజరు

AP: తిరుపతిలో నేటి నుంచి 3 రోజులపాటు అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు చంద్రబాబు, ఫడణవీస్, ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పాల్గొననున్నారు. వీరు ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. దాదాపు 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.
News February 17, 2025
కొమరవెల్లి మల్లన్నకు 14 కిలోల వెండి తొడుగు ఆభరణాలు అందజేత

కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా Epitome Projects కంపెనీ అధినేత కంత జైపాల్ భార్య శ్రీవిద్య దంపతులు కలిసి స్వామివారికి 14 కిలోల వెండి తొడుగు ఆభరణాలను ఆదివారం అందజేశారు. ఈ ఆభరణాలను వారి తల్లిదండ్రులైన కంత స్వర్ణలత భర్త అశోక్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ఈఓకు అందించారు. వీటిల్లో విఘ్నేశ్వర స్వామి, మునీశ్వర స్వామి, సంగమేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి.
News February 17, 2025
మానవత్వం చాటుకున్న హరీశ్ రావు

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదుకున్నారు. ఆధార్ కార్డు లేదని ప్రమీల అనే మహిళను వైద్యం చేయకుండా ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది బయటకు పంపించారు. సమస్య తన దృష్టికి రావడంతో స్పందించి, మానవత్వం చాటుకుని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండ్‌తో మాట్లాడి తక్షణం ఆసుపత్రిలో చేర్చుకోవాలని, చికిత్స అందించాలని హరీశ్ రావు ఆదేశించారు.