News March 3, 2025
పేకాట స్థావరంపై దాడి.. 17 మంది అరెస్టు

హిందూపురం మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని కొండ ప్రాంతాల్లో జరుగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో సీఐ చంద్ర ఆంజనేయులు తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. 17 మందిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి 10 బైకులు, రూ.81 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాటను అశ్వత్థప్ప అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Similar News
News January 11, 2026
ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?

ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం బీటా-కెరోటిన్ అనే సహజ వర్ణద్రవ్యం. ఇది ఆవులు గడ్డి, ఆకుకూరలు తిన్నప్పుడు ఈ బీటా-కెరోటిన్ పాల కొవ్వులో కలిసిపోయి, పాలకి లేత పసుపు రంగునిస్తుంది. ఇది ‘విటమిన్-ఎ’గా మారుతుంది. గేదె పాలలో బీటా-కెరోటిన్ లేకపోవడం వల్ల తెల్లగా ఉంటాయి. కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి తయారీకి గేదె పాలే మంచివి. ఒకవేళ స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలను ఎంచుకుంటే మంచిదట.
News January 11, 2026
వికారాబాద్: పేదబిడ్డకు రూ.లక్ష పెళ్లికానుక

కోటపల్లి మండలం కరీంపూర్ గ్రామంలో ఎవరి పెళ్లి జరిగినా రూ.1,05,116 ఇస్తానని మాజీ సర్పంచ్ అనిల్ సుందరి ఎన్నికల వేళ మాటిచ్చారు. హామీ మేరకు ఆదివారం రాత్రి ఆ కుటుంబానికి అందచేశారు. కరీంపూర్ గ్రామానికి చెందిన లాల్బీ వాహేద్ కూతురు పెళ్లి కానుకతో ఆ కుటుంబానికి వెలుగునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంపూర్ సర్పంచ్ షబానబి సదత్ పటేల్, ఉప సర్పంచ్ యేసయ్య ఉన్నారు.
News January 11, 2026
NLG: లక్ష్యానికి దూరంగా.. మీనం..!

నల్గొండ జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియపై మత్స్యకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ముగిసినా నిర్దేశిత లక్ష్యంలో 80 శాతం పూర్తికాకపోవడం గమనార్హం. జూలైలోనే జలాశయాలు నిండినా, నిధుల విడుదల ఆలస్యమవడంతో పంపిణీలో జాప్యం జరిగింది. ప్రభుత్వం స్పందించి మిగిలిన కోటాను పూర్తి చేయడంతో పాటు, నాణ్యమైన చేప పిల్లలను అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


