News March 3, 2025
పేకాట స్థావరంపై దాడి.. 17 మంది అరెస్టు

హిందూపురం మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని కొండ ప్రాంతాల్లో జరుగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో సీఐ చంద్ర ఆంజనేయులు తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. 17 మందిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి 10 బైకులు, రూ.81 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాటను అశ్వత్థప్ప అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Similar News
News March 15, 2025
KMR: మద్యం మత్తులో కరెంట్ పోల్ ఎక్కి హల్‌చల్

నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో చాకలి నరసింహులు అనే యువకుడు మద్యం మత్తులో కరెంటు స్తంభం ఎక్కి వీరంగం సృష్టించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ గ్రామానికి చెందిన చాకలి నరసింహులు తన ఇంట్లోకి కరెంటు సరఫరా కావడం లేదని విద్యుత్ స్తంభం ఎక్కి ప్రయత్నం చేశారు. ఇంటి పక్క వారు వెంటనే సబ్ స్టేషన్‌కు ఫోన్ చేయడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది.
News March 15, 2025
ఉచిత DSC శిక్షణకు నేడే తుది గడువు

తిరుపతి జిల్లాలో SC, ST అభ్యర్థులకు ఉచిత DSC కోచింగ్ కోసం దరఖాస్తులకు నేటి(శనివారం) వరకు అవకాశం ఉన్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటిని పరిగణలోకి తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. వారితో పాటూ బీసీలకు కూడా అవకాశం ఉందని బీసీ వెల్ఫేర్ అధికారి జోత్స్న తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.
News March 15, 2025
KNR: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. కరీంనగర్ పట్టణంలో న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.