News March 17, 2025
పేట్రేగుతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.5కోట్లు దోచేశారు

నెల్లూరు జిల్లాలో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. నెల రోజుల్లో దాదాపు రూ.5కోట్లు దోచేసినట్లు సమాచారం. డాక్టర్లు, ఆడిటర్లు, రిటైర్డ్ టీచర్లే లక్ష్యంగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్‌లు అంటూ భయపెడుతూ యథేచ్చగా అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల CBI అధికారినంటూ ఓ వ్యక్తి వద్ద కోటికి పైగా దోచేసిన విషయం తెలసిందే. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News April 24, 2025
NLR: రేషన్ డీలర్ల వద్దకు పరుగులు

రేషన్ ఇంటికి రావాలంటే ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లాలోని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఈకేవైసీ చేయండి అంటూ చాలామంది డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఈకేవైసీ స్టేటస్ ఇంటర్నెట్లోనూ చూసుకోవచ్చని అధికారులు సూచించారు.
News April 24, 2025
16 పాఠశాలల్లో అందరూ పాస్: అరుణమ్మ

నెల్లూరులోని 16 జడ్పీ పాఠశాలల్లో అందరూ పాసయ్యారని జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 10,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 7,414 మంది పాసయ్యారని చెప్పారు. 595 మార్కులతో పూజిత అనే విద్యార్థి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థులకు ఆమె అభినందనలు తెలిపారు.
News April 24, 2025
మధుసూదన్ ఇంటికి రానున్న Dy.CM పవన్

ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికకాయానికి Dy.CM పవన్ కళ్యాణ్ నివాళులర్పించనున్నారు. ఆయన గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు కావలికి రానున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.