News March 1, 2025

పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యం: కలెక్టర్

image

ఆర్థికంగా అత్యంత వెనుక బడిన కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం ద్వారా జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లకు ఆయన పేదరిక నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.

Similar News

News March 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 3, 2025

దుబాయ్ వెళ్లింది మ్యాచ్ కోసం కాదు: హరీశ్ రావు

image

TG: తాను దుబాయ్ వెళ్లింది క్రికెట్ మ్యాచ్ కోసం కాదని BRS నేత హరీశ్ రావు తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి కోసం వెళ్లానని ట్వీట్ చేశారు. ‘రాష్ట్రంలో ఉండి కూడా ఎస్‌ఎల్‌బీసీ బాధితులను సీఎం పరామర్శించలేదు. మానవత్వం మరచి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. విలాసాల్లో మునిగింది నేను కాదు.. సీఎం, మంత్రులే. నిఘా పెట్టాల్సింది మా మీద కాదు. ప్రజా ప్రయోజనాలపైనా’ అని పేర్కొన్నారు.

News March 3, 2025

జిల్లాలో మావోయిస్టు కదలికలు లేవు: ములుగు SP

image

ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా అంతరించిపోయాయని SP శబరిశ్ స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని 25 ఏళ్ల తర్వాత ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గేట్లు తెరిచి వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించామన్నారు. 2001లో పీపుల్స్ వార్ సభ్యులు ట్రాక్టర్లలో మందుపాతరలు అమర్చి స్టేషన్ పేల్చివేశారని, అయితే ప్రస్తుతం జిల్లాలో వారి కార్యకలాపాలు లేవన్నారు.

error: Content is protected !!