News March 6, 2025

పేద‌రికం లేని స‌మాజం ల‌క్ష్యంగా పీ4 స‌ర్వే: కలెక్టర్

image

పేద‌రికం లేని స‌మాజ నిర్మాణం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌బ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్ పార్ట‌న‌ర్‌షిప్ (పీ4) స‌ర్వేకు రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 8వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బంది ద్వారా స‌ర్వే జ‌రుగుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో వ‌ర్చువ‌ల్‌గా పీ4 స‌ర్వేపై స‌మావేశం నిర్వహించారు.

Similar News

News October 20, 2025

వంటింటి చిట్కాలు

image

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

News October 20, 2025

‘చందన బ్రదర్స్’ అధినేత కన్నుమూత

image

చందన బ్రదర్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్‌రావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో 1971లో చందన బ్రదర్స్ సంస్థను ఆయన ప్రారంభించారు. దూరదృష్టితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు.

News October 20, 2025

కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం రావాలి: జాన్‌వెస్లీ

image

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గెర్రె గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్రంగా ఖండించారు. కాచిగూడలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని, కుల, మతాంతర వివాహితుల రక్షణచట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.