News March 6, 2025
పేదరికం లేని సమాజం లక్ష్యంగా పీ4 సర్వే: కలెక్టర్

పేదరికం లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్ (పీ4) సర్వేకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే జరుగుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో వర్చువల్‌గా పీ4 సర్వేపై సమావేశం నిర్వహించారు.
Similar News
News April 13, 2026
HYD: భర్త డ్యూటీకి.. భార్య వీడియో కాల్స్

ఆడియో, వీడియో కాల్ యాప్స్ సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. HYD సహా ఇతర ప్రాంతాల్లో చదువుకునే వారి నుంచి మహిళల వరకు యువకులకు వల వేస్తూ డబ్బు సంపాదనలో మునిగి, విలువలను మరుస్తున్నారు. మరికొందరేమో భర్త డ్యూటీకి వెళ్లాక అబ్బాయిలతో టైంపాస్ కోసం, జనరల్ టాకింగ్ అంటూ ఇలాంటి యాప్స్‌నకు ఆకర్షితులవుతున్నట్లు Gen-S సర్వే తెలిపింది. భార్య లేనప్పుడు భర్తలు సైతం వీటిలోకి టైమ్ పాస్ అంటూ వస్తున్నట్లు పేర్కొంది.
News April 13, 2026
కొండవీడు కోటపై ‘నైట్ క్యాంపింగ్’.. ప్రకృతి ఒడిలో రాత్రి బస!

పల్నాడు జిల్లాలోని చారిత్రక కొండవీడు కోటపై పర్యాటకుల కోసం అటవీశాఖ నైట్ టెంట్ క్యాంపింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో రాత్రి బసతో పాటు మ్యూజికల్ నైట్, క్యాంప్ ఫైర్, సూర్యోదయ వీక్షణ, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ధర పెద్దలకు రూ. 2,000, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు రూ. 1,000గా నిర్ణయించారు. వీటితో పాటు ట్రెక్కింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలు కూడా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి.
News April 13, 2026
PHOTO: కండలు తిరిగిన శరీరంతో Jr.NTR

‘డ్రాగన్’ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కండలు తిరిగిన బాడీ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది క్షణాల్లోనే వైరలైంది. తారక్ బాడీ బాక్సాఫీస్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


