News March 4, 2025

పేదరిక జిల్లాగా ఉమ్మడి అనంతపురం

image

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో అనంతపురం జిల్లా 6వ స్థానంలో ఉంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. కాగా అత్యంత పేదరిక జిల్లాగా మొదటి స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది.

Similar News

News November 23, 2025

చిలకపాలెం-రాయగడ రోడ్డు పనులకు రేపు శంకుస్థాపన

image

చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు రాజా సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో బేబినాయన కోరడంతో రూ.4.50కోట్లు మంజూరయ్యాయి. గొర్లెసీతారాంపురం వద్ద శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 23, 2025

ఈ నెల 28న అమరావతికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

image

ఈ నెల 28న రాజధాని అమరావతిలో పలు బ్యాంక్‌ భవనాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ బ్యాంకులకు CRDA భూకేటాయింపులు చేసింది. శంకుస్థాపన అనంతరం CRDA ప్రధాన కార్యాలయం దగ్గర సభకు నిర్మలా సీతారామన్‌, పెమ్మసాని, చంద్రబాబు, పవన్‌ హాజరు కానున్నారు.

News November 23, 2025

మెదక్: రిజర్వేషన్ కోసం ఎదురు చూపులు?

image

మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 492 పంచాయతీలుండగా 4,220 వార్డులు, మొత్తం ఓటర్లు 5,23,327 ఉన్నారు. ఇందులో మహిళలు 2,71,787, పురుషులు 2,51,532 ఇతరులు 8 మంది ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కసరత్తు నడుస్తోంది. తమకు అనుకూలంగా వస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.