News March 4, 2025

పేదరిక జిల్లాల లిస్ట్‌లో అన్నమయ్య జిల్లాకు 12వ స్థానం

image

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం.. అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో అన్నమయ్య జిల్లా 12వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్‌కౌంట్ రేషియో 3.34%గా ఉండగా.. తీవ్రత విషయంలో 38.51%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.013గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ప.గో జిల్లా మొదట ఉంది. గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.

Similar News

News March 4, 2025

నల్గొండ: ఇంటర్ పరీక్షలకుసర్వం సిద్ధం: డీఐఈఓ

image

రేపటి నుంచి ప్రారంభంమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని డీఐఈఓ దశ్రు నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు గంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

News March 4, 2025

వికారాబాద్: పరీక్షలకు సర్వం సిద్ధం: శంకర్ నాయక్

image

జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు నోడల్ అధికారితో కలిసి పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8:45లోగా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు చేరుకోవాలని 9:05 నిమిషాల వరకు అనుమతి ఇస్తారన్నారు.

News March 4, 2025

SKLM: కంటి వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

image

గ్రామ స్థాయిలో కంటి వ్యాధులపై ఆప్తాల్మీక్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య DM&HO టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా DM&HO కార్యాలయంలో ఆప్తాల్మిక్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ప్రతి ఒక్క ఆప్తాలమిక్ అధికారి వారి పరిధిలో ఎన్జీవో ఆసుపత్రి వారు నిర్వహించే క్యాటరాక్ట్ క్యాంపులను సందర్శించి అంధత్వంతో బాధపడుతున్న వారికి రిఫర్ చేయాలన్నారు.

error: Content is protected !!