News March 23, 2025
పేదరిక నిర్మూలనే పీ4 లక్ష్యం: నంద్యాల కలెక్టర్

పేదరికాన్ని నిర్మూలించడమే పీ-4 (ప్రభుత్వ-ప్రైవేట్-ప్రజల-భాగస్వామ్య) వ్యవస్థ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్లో భాగంగా పేదరిక నిర్మూలనకు పీ4 విధానంపై చర్చ, అభిప్రాయ సేకరణపై సమావేశం నిర్వహించారు. జిల్లా వృద్ధిరేటును గణనీయంగా పెంచాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.
Similar News
News December 10, 2025
నేడు జగ్గన్నతోట ప్రబల తీర్థంపై సమావేశం

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో 11 గ్రామాలకు చెందిన ఏకాదశ రుద్రులు కొలువు తీరే ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించనుంది. నాలుగున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ తీర్థం నిర్వహణ సమీపిస్తుండటంతో ఆర్డీఓ శ్రీకర్ సారధ్యంలో అధికారులు బుధవారం మొసలపల్లిలో ఉత్సవ కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. లక్షలాది మంది తరలి వచ్చే తీర్థం ఏర్పాట్లపై సమావేశంలో సమీక్షించనున్నారు.
News December 10, 2025
గొడవలు ఎందుకొస్తాయంటే?

ఏ రిలేషన్షిప్లో అయినా సరే గొడవలు రావడానికి కారణం కమ్యునికేషన్ లేకపోవడం. సరైన సంభాషణ జరగనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం కూడా కలుగుతుంది. అలానే ఒకరి భావాలు మరొకరికి తప్పుగా అర్థం అవుతాయి. కాబట్టి కమ్యునికేషన్ బావుండేలా చూసుకోవడం మంచిది. ఇలా కూడా సగం గొడవలు కంట్రోల్ అవుతాయి. సరిగ్గా మాట్లాడడం, ఓపెన్గా మాట్లాడడటం వల్ల గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.
News December 10, 2025
కాశీలో శని దోషాలు పోగొట్టే ఆలయం

కాశీలో విశ్వేశ్వరుడు, విశాలాక్షి దేవి ఆలయాలతో పాటు అన్నపూర్ణాదేవి గుడి కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ఆహారానికి లోటుండదని నమ్మకం. అలాగే సంకట మోచన్ హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తే సంకటాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి దర్శనంతో ఏలినాటి శని దోషాలు పోతాయని అంటున్నారు. భక్తులు మణికర్ణికా, దశాశ్వమేధ ఘాట్లు దర్శించి గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.


