News April 8, 2025

పేదల గృహాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో పేదల గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి సోమవారం ఆమె మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మే 31వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 8,839 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు.

Similar News

News April 17, 2025

ఒంగోలు: త్వరలో ఈ చెక్ ఇతివృత్తంతో కార్యక్రమం

image

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో ఈ – చెక్ ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతినెలా మూడో శనివారం ప్రత్యేక ఇతివృత్తంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 19న చేపట్టే కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

News April 17, 2025

ఒంగోలు: బ్రోచర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్), శక్తి యాప్‌లపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన మిత్ర శక్తి యాప్‌లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన బ్రోచర్‌ను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News April 17, 2025

గిద్దలూరు: తాటి చెట్టు పైనుంచి కిందపడి వ్యక్తి మృతి

image

తాటి చెట్టు పై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాల పాలైన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో గురువారం చోటుచేసుకుంది. దిగువమెట్టకు చెందిన సిరివల్ల రామచంద్రుడు (42) తాటి చెట్టు ఎక్కి తాటి నుంజలు కోస్తూ ఉండగా జారి కింద పడటంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

error: Content is protected !!