News March 13, 2025
పేదల గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అదనపు ఆర్థిక సహాయం వినియోగించుకొని ఇంటి నిర్మాణాలను పూర్తిచేసుకోవాలని ఆమె కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. 2029 నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.
Similar News
News November 19, 2025
కుక్క కాట్లు బాబోయ్.. ఘననీయంగా పెరిగిన సంఖ్య.!

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కుక్క కాటు కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇ సంఖ్య అధికంగా ఉంది. NTR (D)లో గతేడాది 15వేల కుక్క కాటు బాధితులు ఉండగా, ఈఏడాది NOV 17నాటికే 16,893 కేసులు నమోదయ్యాయి. కుక్క కాటుపై అవగాహన పెరగడంతో చిన్న గాయమైనా వెంటనే ఆసుపత్రికి వచ్చి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ చేయించుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. NTRలో ప్రస్తుతం 11వేల ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.
News November 19, 2025
జిల్లాలో పర్యటించనున్న షెడ్యూల్డ్ కులాల కమీషన్: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్ ఆధ్వర్యంలో కమిటీ జిల్లాలో శుక్రవారం పర్యటించనుంది. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
News November 19, 2025
సిద్దిపేట: ‘RRRలో భూమిని కోల్పోతున్న వారిని ఆదుకుంటాం’

రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని, భూ సేకరణకు రైతులు సహకరించాలని కలెక్టర్ హైమావతి తెలిపారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న మర్కూక్, వర్గల్ మండలాల రైతులతో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.


