News January 23, 2025
పేదల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం: మంత్రి జూపల్లి

పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఖిల్లా గణపురం మండలం సల్కెలాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డితో కలిసి పాల్గొన్నారు. జూపల్లి మాట్లాడుతూ.. అర్హులకు పథకాలు మంజూరు చేస్తామన్నారు.
Similar News
News October 23, 2025
తుని ఘటనలో సంచలన విషయాలు

AP: కాకినాడ(D) తునిలో బాలికపై వృద్ధుడి <<18071366>>లైంగికదాడి <<>>కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గురుకులలో చదువుతున్న అమ్మాయికి తినుబండారాలు కొనిచ్చి, మాయమాటలు చెప్పి నిందితుడు నారాయణరావు(62) దగ్గరయ్యాడని తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చూపిస్తానని స్కూలు నుంచి పలుమార్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అతడిపై పోక్సో సహా 3 కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
News October 23, 2025
MBNR: ఎన్రోల్ మెంట్.. సద్వినియోగం చేసుకోండి

MBNRలోని ప్రభుత్వ ఐటిఐ బాలికల కళాశాలలో ‘TOMCOM’ సంస్థ ఆధ్వర్యంలో జపనీసు భాషపై శిక్షణ, ఉద్యోగాలపై ఇవాళ ఉ.10:00- మ.3:00 వరకు ఎన్రోల్మెంట్ నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియా Way2Newsతో తెలిపారు. GNM డిప్లొమా చేసిన విద్యార్థులు అర్హులని, వయసు 22-35లోపు ఉండాలని, పూర్తి వివరాలకు www.tomcom.telangana.gov.in వెబ్సైట్లో సందర్శించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 23, 2025
ఖమ్మం: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

కూసుమంచి(M) నర్సింహులగూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు వీరయ్యపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విద్యార్థినుల ఫిర్యాదుపై విచారించిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 2016లో తెల్లారుపల్లి పాఠశాలలోనూ ఈ ఉపాధ్యాయుడు సస్పెన్షన్ అయినట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల ఖమ్మం అర్బన్(M) నయాబజార్ పాఠశాలకు డిప్యూటేషన్పై వెళ్లారు.