News January 23, 2025
పేదల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం: మంత్రి జూపల్లి

పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఖిల్లా గణపురం మండలం సల్కెలాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డితో కలిసి పాల్గొన్నారు. జూపల్లి మాట్లాడుతూ.. అర్హులకు పథకాలు మంజూరు చేస్తామన్నారు.
Similar News
News February 9, 2025
PHOTO: ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు

మెగా హీరోలు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి జిమ్‌లో ఉన్న ఫొటోను మరో హీరో వరుణ్ తేజ్ పంచుకున్నారు. జిమ్ ట్రైనర్‌తో కలిసి వారు ఫొటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ RC16లో బిజీగా ఉండగా ‘సంబరాల ఏటి గట్టు’తో సాయి ధరమ్ తేజ్, మేర్లపాక గాంధీ సినిమాతో వరుణ్ బిజీగా ఉన్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ చాలా కాలం తర్వాత మెగా హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం సంతోషంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
News February 9, 2025
గుంటూరు ప్రజలకు SP సతీశ్ సూచన

గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)ని రద్దు చేయడం జరిగిందని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను తిరిగి ప్రకటిస్తామని చెప్పారు.
News February 9, 2025
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే చెప్పండి: మెదక్ పోలీసులు

పై ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని మెదక్ జిల్లా పోలీసులు సూచించారు. మెదక్ మండల కేంద్రంలోని ఒకటో నంబర్ కల్లు దుకాణంలో మహిళను మభ్యపెట్టి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకుని పరారైన దుండగుడి ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే సంబంధిత పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.