News March 9, 2025
పేదల సొంతింటికి రూపం ఇందిరమ్మ ఇల్లు: తుమ్మల

పేదల సొంతింటికి రూపం ఇందిరమ్మ ఇల్లు అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్గొండలో ఇందిరమ్మ ఇంటి నమూనాను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అర్హత కలిగిన నిరుపేద కుటుంబానికి ఇళ్లు వస్తాయని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎమ్మెల్యేలు బాలునాయక్, వీరేశం, జైవీర్ రెడ్డి, సామెలు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News March 17, 2025
నల్గొండ: వచ్చే నెల నుంచే సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్

తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుంది అన్నారు. వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇస్తున్నామని, కాంగ్రెస్ మాటలు చెప్పేది కాదు, చేతల్లో చూపెడుతుందని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేయబోతున్నామని అన్నారు.
News March 16, 2025
నల్గొండలో చికెన్ ధరలు ఇలా

నల్గొండలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) కేజీ రూ.145 ఉండగా.. స్కిన్లెస్ కేజీ రూ. 165 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.100 ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, గత మూడు రోజులుగా అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.
News March 16, 2025
NLG: పోరుబాటకు సిద్ధమైన అంగన్వాడీలు

తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై మరోసారి పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమయ్యారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీచర్లు, ఆయాలు ఈనెల 17, 18వ తేదీల్లో నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ధర్నాకు సంబంధించి ఐసీడీఎస్ కార్యాలయాల్లో అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఐసీడీఎస్ నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని రద్దు చేయాలని కోరారు.