News March 16, 2025
పేదవాడి ఫ్రిజ్.. ఆదిలాబాద్ రంజన్లకు భలే గిరాకీ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల నుంచి ఎండలు తారస్థాయికి చేరాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీరు కోసం ప్రజలు రంజన్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. పలు కూడళ్లలో అదిలాబాద్, నిర్మల్, రాజస్తాన్ తదితర ప్రాంతాల రంజన్లను బట్టి రూ. 100 – 450 విక్రయిస్తున్నారు. సహజ సిద్ధమైన మట్టితో తయారు చేసిన రంజన్ నీరు ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Similar News
News March 16, 2025
నిజామాబాద్: అనుమానాలను నివృత్తి చేయాలి: కవిత

గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ట్రాన్స్లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని అంటున్నారన్నారు.
News March 16, 2025
బోధన్: షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన రాష్ట్ర మంత్రి

బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రైతులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మహారాష్ట్రలోని సాంగ్లీ తాలూకాలో చెరుకు పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీధర్ బాబు, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సాంగ్లీలోని శ్రీదత్త షుగర్ ఫ్యాక్టరీ ఛైర్మన్ శ్రీగణపతి రావు పాటిల్, నాయకులు పాల్గొన్నారు.
News March 16, 2025
NZB: 40 డిగ్రీలకు చేరువలో ఎండ

నిజామాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఎండ 40 డిగ్రీలకు చేరువ చేరింది. దానికి తోడు వడ గాలులు కూడా వీస్తున్నాయి. దీనితో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలు వేడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. కాగా గత ఏడాది ఇదే రోజు 34 డిగ్రీలుగా ఎండ నమోదైంది.