News April 6, 2024

పేపర్లు చూపించి కోట్లు అడుగుతున్నాడు: ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్

image

అర్వింద్‌ ఎంపీగా ఉండి జిల్లాకు చేసింది శూన్యమని బాజిరెడ్డి అన్నారు. ఆయనపై ఏడు సెగ్మెంట్ల ప్రజలు గుర్రుగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి.. రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. అప్పుడేమో బాండ్‌ పేపర్‌ చూపించి ఓట్లు దండుకున్న అర్వింద్‌ మళ్లీ ఇప్పుడు ఇటీవల ఏదో జీవో కాపీ తీసుకువచ్చి ఎంపీగా గెలిపించాలని ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసమన్నారు.

Similar News

News November 11, 2025

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: టీయూ విద్యార్థి సంఘాలు

image

తెలంగాణ యూనివర్సిటీలో 2012 లో జరిగిన నియామకాలు చెల్లవని ఇచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని NSUI,PDSU నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సమావేశంలో NSUI, వర్సిటీ మాజీ అధ్యక్షుడు శ్రీశైలం,PDSU నాయకులు అనిల్ కుమార్ మాట్లాడారు.తప్పుడు పత్రాలతో నియామకం అయిన వారిని తొలగించి,హైకోర్టు తీర్పును పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.నాయకులు రాజు, గోవింద్,మహేష్,అరుణ,పవిత్ర,నవీన్ తదితరులున్నారు.

News November 11, 2025

నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ మేళా

image

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చేసిన యువతి, యువకులు అర్హులని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. వయస్సు18 నుంచి 30 లోపు వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని తెలిపారు.

News November 11, 2025

NZB: ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

image

కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు.