News January 3, 2025

పేరలి గ్రామ సర్పంచిపై అనర్హత వేటు

image

కర్లపాలెం(M) పేరలి పంచాయతీ సర్పంచ్‌ మల్లెలవెంకటేశ్వర్లుపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు ప్రిన్సిపల్ గుంటూరు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఆదేశాలిచ్చింది. పేరలి సర్పంచి ఎన్నికల్లో భాగంగా వెంకటేశ్వర్లు నామినేషన్ ఫారంలో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచాడని, ఆయన ఎన్నిక చెల్లదని వీరయ్య అనే వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. విచారించిన కోర్టు ఆయన ఎన్నిక చెల్లదని, సర్పంచ్ పదవికి అనర్హుడని తీర్పునిచ్చింది.

Similar News

News November 12, 2025

న్యూమోనియా రహిత సమాజ నిర్మాణం లక్ష్యం: కలెక్టర్

image

న్యూమోనియా వ్యాధి రహిత సమాజ నిర్మాణం లక్ష్యమని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. న్యూమోనియా వ్యాధిపై అవగాహన పోస్టర్లను బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. ప్రతీ సంవత్సరం నవంబర్ 12వ తేదిన ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఊపిరితిత్తులలో అసాధారణ ద్రవం చేరడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని కల్గించే పరిస్థితిని న్యూమోనియా అన్నారు.

News November 12, 2025

గుంటూరు రైల్వే, బస్టాండ్‌లలో భద్రతా తనిఖీలు

image

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అదనపు ఎస్పీ హనుమంతు ఆధ్వర్యంలో జిల్లా భద్రతా విభాగం పోలీసులు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బీడీ టీములు, జాగిల బృందాలు ప్రయాణికుల సామానును, కౌంటర్లను క్షుణ్ణంగా పరిశీలించాయి. అనుమానిత వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

News November 12, 2025

తెనాలి: పవర్ లిఫ్టర్ షబీనాకు సీఎం అభినందన

image

అంతర్జాతీయ పవర్ లిఫ్టర్, తెనాలికి చెందిన షేక్ షబీనా ‘బెస్ట్ రైజింగ్ స్పోర్ట్స్ పర్సన్ అవార్డు’కు ఎంపికయ్యారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు షబీనాను శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు.