News December 21, 2024
పేరేచర్ల: అర్ధరాత్రి ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్
మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల కాలువ సమీపంలో అర్ధరాత్రి ప్రమాదం సంభవించి ఓ యువకుడు ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 25, 2025
మంగళగిరి: ఏపీఎస్పీ కానిస్టేబుల్ అదృశ్యం
మంగళగిరి పరిధిలోని ఏపీఎస్పీ 6వబెటాలియన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శనివారం లిఖితపూర్వకంగా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.
News January 24, 2025
నిఘా పెట్టి.. నేరాలు నియంత్రణ చేయాలి: ఎస్పీ
గుంటూరు జిల్లా నేర విభాగం పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. నేరాల దర్యాప్తు, చోరీకి గురైన సొమ్ము రికవరీ తీరు తదితర అంశాల గురించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా తగిన నిఘా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జైలు నుంచి వచ్చిన నేరస్తులు, దొంగల కదలికలపై నిఘా పెట్టి నేరాలు జరుగకముందే వాటిని కట్టడి చేయాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ సుప్రజ ఉన్నారు.
News January 24, 2025
గుంటూరు: మూడు రోజులు పోలీసు కస్టడీకి తులసి బాబు
RRRను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసి బాబును మూడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ శుక్రవారం ఆదేశించారు. నగరంపాలెం పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో ఒంగోలు ఎస్పీ విచారణాధికారి. ఐదు రోజుల కస్టడీకి పిటీషన్ దాఖలు చేయగా, తులసి తరఫు న్యాయవాదులు అందుకు నిరాకరించారు. కేసు పూర్వపరాలు, వాదోపవాదాల అనంతరం మూడు రోజుల కస్టడీకి అనుమతించారు.