News January 8, 2025
పేర్నినానికి బెయిల్ ఇవ్వొద్దు: అడ్వకేట్
మాజీ మంత్రి పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యాన్ని మాయం చేశారన్న వాటిపై అన్ని ఆధారాలు ఉన్నాయని బెయిల్ ఇవ్వొద్దని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. గోడౌన్ మేనేజర్ నుంచి పేర్ని నాని బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నానికి బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం చేస్తారన్నారు. బెయిల్ పిటీషన్‌ను 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
Similar News
News January 20, 2025
పమిడిముక్కల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పమిడిముక్కల మండలంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్రం(23), ముక్త దుర్గ బాబు(24) లు బైక్‌పై వెళ్తుండగా మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై కెసిపి ఫ్లైఓవర్ గోడను అదుపుతప్పి ఢీకొనడంతో మృతి చెందారు. కాకినాడ నుంచి హైదరాబాదుకు వెళ్తుండగా ఉదయాన్నే మంచు ప్రభావంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పమిడిముక్కల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News January 20, 2025
కైకలూరు: పాత కక్షలతో హత్య.. పట్టుకున్న పోలీసులు
పాత కక్షల కారణంగా పథకం ప్రకారం కాపుకాసి హత్య చేసిన నిందితుడు బోధనపు శ్రీనివాసరావును అరెస్టు చేసారని ఏలూరు డీఎస్పీ డి. శ్రావణకుమార్ తెలిపారు. ఆదివారం కైకలూరు సర్కిల్ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. కొన్నిరోజుల క్రిందట కలిదిండి మండలం సంతోషపురం గ్రామ మాజీ సర్పంచ్ కాలువ నల్లయ్య హత్యకు గురయ్యారు. విచారణ చేపట్టి తక్కువ సమయంలో ఈ కేసును ఛేదించిన సీఐ రవికుమార్, ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు.
News January 20, 2025
విజయవాడలో యువకుడి ఆత్మహత్య
విజయవాడ నగరంలోని రాధనగర్‌లో శనివారం వాచ్‌మెన్ గొర్లి శివ (25) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నున్న పోలీసులు తెలిపిన వివరాల మేరకు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న శివను యజమాని పిలువగా పలకలేదు. తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సాయంతో తలుపు తెరచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు