News December 30, 2024
పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు
పేర్ని నానికి చెందిన సివిల్ సప్లయిస్ బఫర్ గోడౌన్‌లో మాయమైన రేషన్ బియ్యాన్ని లెక్కతేల్చిన అధికారులు అదనంగా షార్టేజీని గుర్తించారు. ఆ బియ్యానికి ఫైన్ చెల్లించాలంటూ జాయింట్ కలెక్టర్ గోడౌన్ యజమానురాలు జయసుధకు సోమవారం నోటీసులు జారీ చేశారు. 378 టన్నుల షార్టేజీని గుర్తించి రూ.3.37 కోట్లు ఫైన్ విధించారు. ముందుగా చెల్లించిన రూ.1.70 కోట్లు మినహాయించి రూ.1.68కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Similar News
News January 19, 2025
నేడు అమిత్ షా ప్రారంభించనున్న NIDM పూర్తి వివరాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(NIDM) దక్షిణ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకురాగా 2015లో గన్నవరం మండలం కొండపావులూరులో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. 2018 మేలో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం ఏర్పాటైన ఈ కేంద్ర సంస్థ తాజాగా నిర్మాణం పూర్తి చేసుకోగా నేడు మంత్రి అమిత్‌షా లాంఛనంగా ప్రారంభించనున్నారు.
News January 19, 2025
పెనమలూరు: బాలికపై లైంగిక దాడికి యత్నించిన ప్రబుద్ధుడు
తాడిగడప కంటి ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న నారాయణ(60) తన ఇంటి సమీపంలో నివసిస్తున్న రెండో తరగతి చదివే బాలికపై లైంగిక దాడికి యత్నించడంతో పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి బాలిక తమ కుక్క పిల్ల కోసం నారాయణ ఇంటి సమీపంలోకి వెళ్లింది. అతడు లైంగిక దాడి చేయబోగా బాలిక తప్పించుకొని వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన శనివారం అతడిని అరెస్ట్ చేశారు.
News January 19, 2025
కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన షెడ్యూల్
కేంద్ర మంత్రి అమిత్‌షా గన్నవరం పర్యటన షెడ్యూల్ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఉదయం 10.45 గంటలకు విజయవాడలోని నోవాటెల్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించే అమిత్‌షా కొండపావులులోని NIDM ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. 11.15కి అక్కడ భవనాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం 11.35 గంటలకు NDRF పదో బెటాలియన్ క్యాంపస్‌ను ప్రారంభించి సభలో ప్రసంగిస్తారన్నారు.