News January 23, 2025

పేర్లు రానివారు ఆందోళన చెందవద్దు: ASF అడిషనల్ కలెక్టర్

image

తిర్యాణి మండలంలోని సోనాపూర్ గ్రామపంచాయతీలో గురువారం ప్రజాపాలన గ్రామసభను తహశీల్దార్ మల్లేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి హాజరయ్యారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా సర్వే జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందవద్దన్నారు. అర్హులంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Similar News

News December 5, 2025

సంక్రాంతి బరిలో బాలకృష్ణ?

image

అనివార్య కారణాలతో బాలకృష్ణ అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే మరో మూడు వారాలు ఆగితే సంక్రాంతి ఫీవర్ వచ్చేస్తుంది. వరుస సెలవులతో థియేటర్ల వద్ద సందడి నెలకొంటుంది. ఈ క్రమంలో సినిమాకు వచ్చిన అడ్డంకులు తొలగించుకుని వాయిదా పడిన అఖండ-2ను సంక్రాంతి బరిలో నిలిపే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అటు చిరంజీవి, ప్రభాస్‌తో సహా పలువురి సినిమాలు జనవరిలో రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి.

News December 5, 2025

శుక్రవారం రోజున ఉప్పు కొంటున్నారా?

image

ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. అలాగే శుక్రవారమన్నా అమ్మవారికి ఇష్టమే. అందుకే శుక్రవారం రోజున ఉప్పు కొంటే చేసిన అప్పులు త్వరగా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలుగుతాయని అంటున్నారు. ‘సంపాదనలో భాగంగా మొదటి ఖర్చును ఉప్పుపైనే పెట్టడం ఎంతో శుభకరం. శుక్రవారం రోజున ఉప్పు కొంటే దారిద్ర్యం తొలగిపోతుంది. మంగళ, శని వారాల్లో ఉప్పు కొనకూడదు’ అని సూచిస్తున్నారు.

News December 5, 2025

బ్యాంక్ కోచింగ్‌కు వెళ్లిన భార్య.. భర్త సూసైడ్

image

అగలిలోని ఇందిరమ్మ కాలనీలో మహాలింగ(32) ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల మేరకు.. వెల్డింగ్ కార్మికుడిగా పనిచేసే మహాలింగ భార్య బ్యాంక్ కోచింగ్ కోసం నంద్యాలకు వెళ్లడంతో ఒంటరితనానికి లోనై ఈ ఘటనకు పాల్పడ్డాడు. తమ్ముడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.