News January 23, 2025
పేర్లు రానివారు దరఖాస్తు సమర్పించాలి: ASF కలెక్టర్

ప్రభుత్వం చేపట్టిన 4 పథకాల అమల్లో భాగంగా గ్రామసభలలో చదివే జాబితాలో పేర్లు రానివారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం కాగజ్‌నగర్ మండలం వంజిరి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. నిందితులకు ముగిసిన విచారణ

AP: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో నలుగురు నిందితులకు కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో వారి విచారణ జరగ్గా, ఇవాళ రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించట్లేదని, మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు కోరినట్లు సమాచారం.
News February 18, 2025
డ్రైనేజీ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలి: కమిషనర్

డ్రైనేజీ నిర్మాణానికి ప్రజల సహకరించాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. 42వ డివిజన్లోని తెలంగాణ కాలనీలో డ్రైన్ ఏర్పాటుకు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలు నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. స్థానికుల సౌకర్యార్థం డ్రైన్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్థానికులతో పాటు సదరు యజమాన్యం సహకరించాలని, వారికి న్యాయం చేస్తామని కమిషనర్ తెలిపారు.
News February 18, 2025
వరంగల్ మార్కెట్లో పలు ఉత్పత్తుల ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మంగళవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11 వేలు పలకగా, దీపిక మిర్చి రూ.16,200, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే నం. 5 రకం మిర్చి రూ.12 వేలు, ఇండికా మిర్చికి రూ.16,200, మక్కలు(బిల్టీ)కి రూ.2,311 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.