News April 11, 2024
పైడితల్లి అమ్మవారిని తాకిన సూర్యకిరణాలు

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం విజయనగరం జిల్లా కేంద్రంలో వెలసిన శ్రీ పైడితల్లి అమ్మవారిని బుధవారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. రైల్వేస్టేషన్ సమీపంలోని ఉన్న వనం గుడిలో అమ్మవారిని సూర్య కిరణాలు తాకడంతో అమ్మ వారిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Similar News
News October 15, 2025
బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ

దీపావళి సందర్భంగా బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. తాత్కాలిక షాపులు పట్టణ శివార్లలోని బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు నీరు, ఇసుక తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 15, 2025
బాలికల సంక్షేమమే లక్ష్యం: DMHO

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విజయనగరం కేజీబీవీలో బాలికల ప్రాముఖ్యతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DMHO జీవన రాణి మాట్లాడుతూ.. బాలికల సంక్షేమానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బాలికల కోసం ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయని వారి హక్కులకు భంగం కలిగితే చర్యలు తప్పవన్నారు. అనంతరం ర్యాలీ చేపట్టి లింగ వివక్షత ఉండరాదని నినాదాలు చేశారు.
News October 14, 2025
జిల్లా వ్యాప్తంగా బెల్టు షాపులను మూసివేయండి: కలెక్టర్

సారా, అనధికార మద్యం రహిత జిల్లాగా విజయనగరం ఉండాలని జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. ఎస్పీ దామోదర్ తో కలిసి ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు గట్టి నిఘా ఉంచాలన్నారు. ప్రభుత్వమే అక్రమ మద్యం, బెల్ట్ షాప్ లు ఉండకూడదని చెప్పిన తర్వాత ఇక ఆలోచించేది లేదని, ఎవ్వరిపై నైనా కేసులు పెట్టే తక్షణమే బెల్ట్ షాప్ లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.