News September 14, 2024

పైడితల్లి జాతరకు సీఎంకు ఆహ్వానం పలికిని విజయనగరం ఎంపీ

image

వచ్చే నెల 15న జరగనున్న విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారి జాతరకు రావాలంటూ సీఎం చంద్రబాబును ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వానించారు. శనివారం ఢిల్లీలో బాబును కలిసిన ఎంపీ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పైడితల్లి అమ్మవారిని సీఎం భార్య భువనేశ్వరి దర్శించుకున్న రోజునే చంద్రబాబుకు బెయిల్ లభించిందన్న విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు.

Similar News

News January 4, 2026

బొండపల్లి నుంచి ‘ఢిల్లీ’ వరకు.. CRRI డైరెక్టర్‌గా డా.రవిశేఖర్

image

విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. చలుమూరి రవిశేఖర్ అరుదైన గౌరవం పొందారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సీఎస్‌ఐఆర్‌, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) డైరెక్టర్‌గా జనవరి 2న బాధ్యతలు స్వీకరించారు. సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం జిల్లా వాసులకు ప్రేరణగా నిలిచింది. రవాణా రంగం, రోడ్డు భద్రతపై ఆయన పరిశోధనలు చేశారు.

News January 4, 2026

VZM: ఈ నెల 5 నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

image

నవంబర్-2025 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి శనివారం తెలిపారు. అబ్జెక్టివ్ పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-5 గంటల వరకు జరుగుతాయని, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉదయం 10-01గం.ల వరకు, మధ్యాహ్నం 3-6 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు తేవాలన్నారు.