News April 9, 2024
పైడిబీమవరంలో రూ. 6,75,000 స్వాధీనం

రణస్థలం మండలంలోని పైడిభీమవరం చెక్పోస్ట్ వద్ద ఎటువంటి రసీదులు, ఆధారాలు లేని వ్యక్తి నుంచి రూ.6,75,000 జేఆర్ పురం ఎస్సై కే. గోవిందరావు, ఎస్సై ఉమామహేశ్ పట్టుకున్నారు. ఆ వ్యక్తి అనపర్తి నుంచి కోటబొమ్మాళికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న నగదును ఆర్వోకు అందజేశామని ఎస్సై తెలిపారు. సంబంధిత రసీదులు అందజేస్తే నగదు అందజేస్తామని తెలిపారు.
Similar News
News November 25, 2025
కంచిలి: విషాదం.. 8నెలల గర్భిణి మృతి

మరో నెల రోజులు గడిచి ఉంటే ఆమెకు పండంటి బిడ్డ పుట్టేది. అమ్మగారితో పాటు అత్తగారింట్లో చిన్నారి అడుగులు పడేవి. ఇంతలోనే విషాదం నెలకొంది. బయటి ప్రపంచంలోకి రాకముందే తల్లితో పాటు ఆ శిశువు కన్నుమూసింది. కంచిలి(M) అర్జునాపురానికి చెందిన ధనలక్ష్మి(26) 8నెలల గర్భిణి. నిన్న రాత్రి పురిటి నొప్పులొచ్చాయి. 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బిడ్డతో సహా ధనలక్ష్మి ప్రాణాలొదిలింది.
News November 25, 2025
పలాస జిల్లా లేనట్లేనా..?

పలాస కేంద్రంగా ఉద్దానం ఏరియాను జిల్లాను చేయాలనే డిమాండ్ ఇక్కడి ప్రజల్లో ఉంది. గత ప్రభుత్వం పలాసను జిల్లా చేస్తామని ప్రకటించినప్పటికీ.. కేవలం రెవెన్యూ డివిజన్గా మార్చి వదిలేసింది. జిల్లాగా ప్రకటించకపోవడంతో పలాసతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈప్రభుత్వంలోనైనా ఏర్పాటు అవుతుందని అందరూ భావించారు. దీనిపై అసలు చర్చే లేకపోవడంతో జిల్లా లేనట్టేనని తెలుస్తోంది.
News November 25, 2025
జాతీయస్థాయి పోటీలకు సిక్కోలు విద్యార్థిని ఎంపిక

జి.సిగడం కేజీబీవీ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని ఆర్.స్వాతి జాతీయస్థాయి పరుగు పందేనికి ఎంపికైంది. హర్యానాలో ఈ నెల 26 నుంచి 30 వరకు అండర్-19 క్యాటగిరీలో 4×100 రిలే పరుగు పందెంలో పాల్గొననుంది. రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రదర్శనతో జాతీయస్థాయికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.


