News April 9, 2024
పైడిబీమవరంలో రూ. 6,75,000 స్వాధీనం

రణస్థలం మండలంలోని పైడిభీమవరం చెక్‌పోస్ట్ వద్ద ఎటువంటి రసీదులు, ఆధారాలు లేని వ్యక్తి నుంచి రూ.6,75,000 జేఆర్ పురం ఎస్సై కే. గోవిందరావు, ఎస్సై ఉమామహేశ్ పట్టుకున్నారు. ఆ వ్యక్తి అనపర్తి నుంచి కోటబొమ్మాళికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న నగదును ఆర్వోకు అందజేశామని ఎస్సై తెలిపారు. సంబంధిత రసీదులు అందజేస్తే నగదు అందజేస్తామని తెలిపారు.
Similar News
News March 23, 2025
ఎచ్చెర్ల: టెన్త్ చూచిరాతలో సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

ఎచ్చెర్ల మండలం కుప్పిలి ఏపీ మోడల్ హైస్కూల్ ఏ, బీ కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల్లో చూచిరాతల్లో సీనియర్ అసిస్టెంట్ కిషోర్‌ను జిల్లా విద్యాశాఖధికారి తిరుమల చైతన్య సస్పెండ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 21న స్థానికులు ఫిర్యాదు మేరకు 14 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన సంఘటన “Way2News” లో వెలువడిన సంగతి తెలిసిందే.
News March 23, 2025
శ్రీకాకుళం జిల్లాలో చికెన్ ధర ఎంతంటే?

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. జిల్లాలో లైవ్ చికెన్ రూ.120 ఉండగా, స్కిన్ రూ.200, స్కిన్ లెస్ రూ.220కి విక్రయాలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ వ్యాపారాలు తగ్గినప్పటికీ ప్రభుత్వం చికెన్ మేళాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో చికెన్ అమ్మకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఎండాకాలంలో మాంసాహారాలు పరిమితిగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
News March 23, 2025
శ్రీకాకుళం: 5 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. వివాహిత అదృశ్యం

హైదరాబాద్ చిలకలగూడ PS పరిధిలో వివాహిత అదృశ్యం అయింది. పోలీసుల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసాద్, శిరీష 5 నెలల క్రితం విజయవాడలో వివాహం చేసుకున్నారు. సీతాఫల్‌మండీ డివిజన్ నామాలగుండులో నివాసం ఉంటున్నారు. ఈ నెల 20న బయటకు వెళ్లిన శిరీష తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోంది. తెలిసిన వారి వద్ద వెదికిన ప్రయోజనం లేకపోయింది. దీంతో భర్త చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.