News October 12, 2024

పైడిమాంబ ఉత్సవాలకు బొత్సకు ఆహ్వానం

image

ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం శ్రీ పైడిమాంబ ఉత్సవాలకు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు. పట్టణంలోని బొత్స నివాసానికి వెళ్లి ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, ఈఓ ప్రసాదరావు పాల్గొన్నారు.

Similar News

News November 27, 2025

VZM: బొత్స భద్రత లోపంపై విచారణకు ఆదేశం

image

పైడితల్లి సిరిమానోత్సవంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు కేటాయించిన వేదిక కూలిన ఘటనపై విచారణకు GAD ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా కలెక్టర్‌ను ఆదేశించారు. బొత్స ప్రొటోకాల్, భద్రతా లోపంపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వేదిక కూలిన ఘటనలో MLC సురేష్ బాబు, ఎస్సై, మరో బాలికకు గాయాలైన సంగతి తెలిసిందే.

News November 26, 2025

ఐదుగురికి జరిమానా.. మరో ఐదుగురికి జైలు శిక్ష: VZM ఎస్పీ

image

విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ & గంట్యాడ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు బుధవారం పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితులను విజయనగరం ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చగా, 5 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, మరో 5 మందికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ శ్రీవిద్య తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.