News April 2, 2025
పైలెట్ గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయండి: జేసీ

వారం రోజుల్లోగా పైలట్ గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం మాట్లాడుతూ.. జిల్లాలో 25 పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో రీ సర్వే జరుగుతుందన్నారు. గ్రామ సరిహద్దులు నిర్ణయించే కార్యక్రమం ప్రారంభించాలన్నారు. రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి నారద ముని, ఆర్డీవో మధులత పాల్గొన్నారు.
Similar News
News October 25, 2025
కార్తిక మాసంలో ఏరోజు పవిత్రమైనది?

కార్తీక మాసంలో ప్రతి దినం భగవత్ చింతనకు శ్రేష్ఠమైనదే. అయితే కార్తీక సోమవారాలు శివుడికి ప్రీతికరమైనవి. ఈ రోజున ఉపవాసం, రుద్రాభిషేకం చేసేవారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోట, ఉసిరి చెట్టును పూజించడం శుభాలకు మూలం. కార్తీక పౌర్ణమి ఈ మాసానికి శిఖరాయమానం. ఈ రోజున చేసే నదీ స్నానం, దీపారాధన ద్వారా శివకేశవుల అనుగ్రహం లభించి, జన్మజన్మల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
News October 25, 2025
GNT: ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞత తెలిపే పండుగ

నాగులచవితి హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన పర్వదినం. ఈరోజు నాగదేవతలను పూజించడం ద్వారా సర్పదోషాలు తొలగి కుటుంబంలో ఆరోగ్యం, సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఉంది. ఆడవారు ఉపవాసం ఉండి పాలు, పండ్లు, పువ్వులతో నాగదేవతను ఆరాధిస్తారు. రైతులు పంటల రక్షణ కోసం, గృహిణులు కుటుంబ సౌఖ్యం కోసం ప్రార్థనలు చేస్తారు. ఇది ప్రకృతి, జీవజాలాల పట్ల కృతజ్ఞత తెలిపే పండుగగా భావిస్తారు.
News October 25, 2025
నా కొడుకు వ్యాఖ్యలను వక్రీకరించారు: సిద్దరామయ్య

తన రాజకీయ జీవితంపై కొడుకు యతీంద్ర చేసిన <<18075196>>వ్యాఖ్యలను<<>> వక్రీకరించారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కాబోయే సీఎం ఎవరనే విషయమై కాకుండా విలువల గురించి తన కొడుకు మాట్లాడారని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై తాను ఇప్పుడే స్పందించనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ విషయమై ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడతానని చెప్పారు.


