News December 20, 2024
పొంగులేటి సీఎం కావాలనుకుంటున్నాడు: KA పాల్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు మిత్రుడని ప్రజాశాంతి అధ్యక్షుడు KA పాల్ అన్నారు. అతను సీఎం అవ్వాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఆయన మాట్లాడారు. పొంగులేటి మొదట ఖమ్మం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచన చేయాలన్నారు. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం మాత్రం అభివృద్ధిలో మాత్రం ముందుకు వెళ్లడం లేదన్నారు.
Similar News
News December 10, 2025
‘పోలింగ్ రోజున వేతనముతో కూడిన సెలవు’

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. SEC, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల యజమానులు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు ఏ విధంగానూ జీతం కట్ చేయవద్దన్నారు.

News December 9, 2025
ఖమ్మం: పోలింగ్ సిబ్బంది 3వ దశ ర్యాండమైజేషన్ పూర్తి

జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బంది మూడవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామా రావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో మంగళవారం పూర్తి చేశారు. 192 గ్రామ పంచాయతీలు, 1,740 వార్డులకు గాను 1,582 బృందాలను ఏర్పాటు చేసి, 20 మంది సిబ్బందిని రిజర్వ్లో ఉంచారు. 1,899 పోలింగ్ అధికారులు, 2,321 ఓపీలను మండలాలవారీగా కేంద్రాలకు కేటాయించారు.