News April 1, 2025
పొందుర్తిలో రైతు ఆత్మహత్య

రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన స్వామి రెండు ఎకరాల్లో పంట సాగు చేసినట్లు చెప్పారు. బోరులో నీటిమట్టం తగ్గిపోవడంతో చేతికొచ్చే పంట ఎండిపోవడాన్ని తట్టుకోలేక తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News December 8, 2025
విదేశాల్లో వాస్తు పాటిస్తారా?

‘వాస్తు నియమాలు నిర్ధిష్ట ప్రాంతానికి పరిమితం కాదు. ప్రపంచంలో ఎక్కడ నివసించినా, వ్యక్తిగత అలవాట్లు వేర్వేరుగా ఉన్నా, పంచభూతాల నియమాలు ఎవరూ విస్మరించలేరు. ప్రపంచంలో వాస్తు సూత్రాలను నిర్లక్ష్యం చేస్తే అది జీవన మనుగడకే ముప్పుగా మారొచ్చు. వాస్తును ప్రాంతాల వారీగా విభజించడం, ఓ ప్రాంతానికే పరిమితం చేయడం అపోహ మాత్రమే. ఈ నియమాలు విశ్వమంతటా పాటించదగినవి’ అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు.
News December 8, 2025
ఎరీన స్పోర్ట్స్ ఫెస్టివల్లో ఏఎన్యూ విద్యార్థుల సత్తా

మంగళగిరిలో నిర్మల ఫార్మసీ కళాశాల నిర్వహించిన ఎరీన 2025 స్పోర్ట్స్ ఫెస్టివల్లో ANU విద్యార్థులు సత్తా చాటారు. ఖోఖో ఉమెన్లో ప్రథమ, 100 మీటర్ల రిలే రన్నింగ్ ప్రథమ, చెస్లో ద్వితీయ స్థానాలు సాధించి బహుమతులు అందుకున్నారు. విజేతలను వర్సిటీ వీసీ గంగాధరరావు అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News December 8, 2025
సంగారెడ్డి: ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అమలు చేయాలి: డీఈఓ

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) వంద శాతం అమలు అయ్యే విధంగా మండల విద్యాధికారులు చొరవ తీసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల విద్యాధికారులతో డీఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ.. ఎంఈఓలు ప్రతి రోజు పాఠశాలలను తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు.


