News March 21, 2024
పొందూరు: కాళింగ కార్పొరేషన్ చైర్మన్పై నిబంధనల ఉల్లంఘన కేసు

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రామారావుపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పొందూరు మండలం తోలాపి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈనెల 17న రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఆత్మీయ సభ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎంగా తన అనుమతి లేకుండా సభ నిర్వహించినట్లు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం, ఎంపీడీవోల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై రవికుమార్ తెలిపారు.
Similar News
News December 2, 2025
ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
News December 2, 2025
తమిళనాడు ప్రమాదం.. 3కి చేరిన శ్రీకాకుళం మృతుల సంఖ్య.!

రామేశ్వరం సమీపంలో కారు, టెంపో ట్రావెల్ బస్సును ఢీకొనగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం (కొండూరు) గ్రామాలకి చెందిన ఇద్దరు యువకులు ఇల్లాకుల నవీన్ (25), పైడి సాయి(26) ఘటనా స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన గుంటరాజు అనే యువకుడు మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
News December 2, 2025
HIVకి భయపడవద్దు: శ్రీకాకుళం కలెక్టర్

హెచ్ఐవికి భయపడవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టర్ బంగ్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60మంది పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ప్రజలు హెచ్ఐవి పట్ల భయపడవద్దని, హెచ్ఐవి బాధితులను అక్కున చేర్చుకోవాలని, వారిపట్ల వివక్ష చూపరాదని సూచించారు. రిస్క్ గ్రూపులకు చెందినవారు నిరంతరం హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలన్నారు.


