News January 6, 2025
పొందూరు: గుండెపోటుతో జవాన్ మృతి

పొందూరు తోలాపి గ్రామానికి చెందిన బొనిగి రమణారావు ఛత్తీసగఢ్ CRPF జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన పండగ సెలవులకు స్వగ్రామానికి వచ్చారు. ఈ మేరకు సోమవారం ఉదయం వాష్ రూమ్‌కు వెళ్లారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
Similar News
News September 18, 2025
ఎచ్చెర్ల: పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో B.Ed 1, 3వ, B.PEd 1వ సెమిస్టర్ల పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ నేడు ఫలితాలను విడుదల చేశారు. యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ https://brau.edu.in/లో ఫలితాలను అభ్యర్థులు చూడవచ్చునన్నారు.
News September 18, 2025
టెక్కలి: గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా అధికారి

టెక్కలి శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకర్రావు గురువారం పరిశీలించారు. స్థానిక అధికారిణి రూపావతితో పలు అంశాలపై మాట్లాడిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన సెస్ బకాయిలు వస్తే గ్రంథాలయాల అభివృద్ధికి దోహద పడతాయన్నారు. అనంతరం పాఠకులతో మాట్లాడారు.
News September 18, 2025
SKLM: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

శ్రీకాకుళం ప్రభుత్వ డీఎల్టీసీ, ఐటీఐలో ప్రవేశాలకు 27వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ మోహనరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు మిగిలిన సీట్లకు నాలుగో విడత కౌన్సెలింగ్ జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం 28న సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 29 న కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.