News January 29, 2025

పొక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు: SP

image

2021లో బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన పొక్సో కేసులో నిందితుడికి 3 ఏళ్ల జైలు, రూ.2వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. బొండపల్లిలోని చంద్రయ్య శ్రీనివాస్ అనే వ్యక్తి బాలికపై అత్యాచార ప్రయత్నం చేయగా స్థానికులను చూసి పారిపోయాడన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టామని, నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.

Similar News

News February 17, 2025

ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతుల పుస్తకావిష్కరణ

image

విజయనగరానికి చెందిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ఠ సేవా పురస్కార గ్రహీత సముద్రాల గురు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతుల పుస్తకాని రచించారు. ఈ పుస్తకాని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆవిష్కరించారు. 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగినప్పుడు స్పీకర్‌గా ఉన్న వెంకటరామయ్య చౌదరి నుంచి నేటి శాసన సభాపతి వరకు 23 మంది శాసనసభాపతుల రాజకీయ జీవిత విశేషాలపై రాసిన పుస్తకం బాగుందని అభినందించారు.

News February 16, 2025

విశాఖలో IPL.. మ్యాచ్‌లు ఎప్పుడంటే..?

image

IPL అంటేనే అదొక మజా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి నేరుగా మ్యాచ్ చూడలేని వాళ్లు టీవీలు, మొబైల్లో ఐపీఎల్‌ను ఆస్వాదిస్తారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్‌లను ఈ సీజన్‌లో విశాఖ ప్రజలు నేరుగా చూడవచ్చు. ఢిల్లీ జట్టు విశాఖ స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకోవడంతో ఇక్కడ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 24న లక్నోతో, 30న సన్ రైజర్స్ హైదరాబాద్‌‌తో ఢిల్లీ తలపడనుంది.

News February 16, 2025

రామతీర్థంలో 26 నుంచి శివరాత్రి జాతర

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు శివరాత్రి జాతర మహోత్సవం జరగనుంది. 26, 27 తేదీల్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు జాగరణ చేస్తారు. 28న వేద పారాయణం అనంతరం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

error: Content is protected !!