News January 29, 2025

పొక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు: SP

image

ఓ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే 2021లో విజయనగరంలోని బొండపల్లిలికి చెందిన చంద్రయ్య శ్రీనివాస్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు నిండితుడిపై పోక్స్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితుడికి 3 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించందని VZM ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు.

Similar News

News November 24, 2025

చందూర్: పదో తరగతి విద్యార్థి సూసైడ్

image

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి గతరాత్రి గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్..పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఎస్సై సాయన్న తెలిపారు.

News November 24, 2025

HYD: ప్రాణాలు పోతున్నాయి.. జాగ్రత్త!

image

వేగం మానుకో అని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు రైడర్లు ఆ మాటను పెడచెవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌తో ఇటీవల HYDలో పదుల సంఖ్యలో చనిపోయారు. సెల్ఫ్ డ్రైవింగ్‌లో చేసిన తప్పిదాలు, డివైడర్లు, <<18366739>>మెట్రో పిల్లర్ల గోడలను<<>> ఢీ కొట్టిన ఘటనలూ ఉన్నాయి. అల్వాల్‌లో ఇవాళ ఉ. ఓ కారు దుకాణాల మీదకు దూసుకురాగా.. సదరు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సో.. హైదరాబాదీ ఇకనైనా స్వీడ్ తగ్గించు.

News November 24, 2025

ఎన్నికలపై విచారణ వాయిదా

image

TG: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. కాగా కోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయనుంది.