News January 29, 2025

పొక్సో కేసులో మదనపల్లె యువకులకు రెండేళ్ల శిక్ష

image

మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరిపై నేరం రుజువు కావడంతో చిత్తూరు పొక్సో కోర్టు జడ్జి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. ఏపీపీ శైలజ వివరాల ప్రకారం.. మదనపల్లెకు చెందిన చరణ్, అహ్మద్ ఓ మైనర్ బాలికను 2022లో కిడ్నాప్ చేశారు. అప్పటి 2- టౌన్ పోలీసులు ఇరువురిపై పొక్సో కేసు నమోదు చేశారు. కేసు నడిచి నేరంరుజువైంది. న్యాయమూర్తి శాంతి దోషులకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నేడు తీర్పునిచ్చారు.

Similar News

News November 6, 2025

ప్రకాశం జిల్లాలో 213 వాహనాలకు జరిమానా

image

ప్రకాశం వ్యాప్తంగా బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2,044 వాహనాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 213 వాహనాలను గుర్తించి రూ.1.56లక్షల జరిమానా విధించారు. డ్రైవింగ్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు.

News November 6, 2025

పిరం కానున్న కొండగట్టు అంజన్న దర్శనం

image

జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పేరిట ఆర్జిత సేవల టికెట్ల ధరలను భారీగా పెంచారు. దీంతో భక్తులకు అంజన్న దర్శనం ‘పిరం’గా మారనుంది. కాగా, అభివృద్ధి అంటే భక్తులకు కనీస వసతులు కల్పించడమా.. లేక ఛార్జీలు పెంచడమా.. అని భక్తులు మండిపడుతున్నారు. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు ఓ పక్క కనీస అవసరాలు లేక అల్లాడిపోతుంటే.. పెంచిన ఈ ఛార్జీలు మరింత భారం కానున్నాయి.

News November 6, 2025

నిజామాబాద్: ఇజ్రాయెల్‌లో JOBS.. రేపు ఇంటర్వ్యూలు

image

ఇజ్రాయెల్ దేశంలో సెరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్ వర్క్, బ్లాక్ బిల్డర్స్(మేసన్స్), జిప్సం వర్క్, ఉద్యోగాల కోసం రేపు నిజామాబాదులో ఎన్రోల్మెంట్, అవగాహనా డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. 21 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండి, 10వ తరగతి పాసైనవారు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు కోరారు. VENUE- జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్. CONTACT- 9959456793.