News January 29, 2025
పొక్సో కేసులో మదనపల్లె యువకులకు రెండేళ్ల శిక్ష

మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరిపై నేరం రుజువు కావడంతో చిత్తూరు పొక్సో కోర్టు జడ్జి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. ఏపీపీ శైలజ వివరాల ప్రకారం.. మదనపల్లెకు చెందిన చరణ్, అహ్మద్ ఓ మైనర్ బాలికను 2022లో కిడ్నాప్ చేశారు. అప్పటి 2- టౌన్ పోలీసులు ఇరువురిపై పొక్సో కేసు నమోదు చేశారు. కేసు నడిచి నేరంరుజువైంది. న్యాయమూర్తి శాంతి దోషులకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నేడు తీర్పునిచ్చారు.
Similar News
News February 18, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ ఏసీబీకి పట్టుబడిన అటవీ అధికారులు✓ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భూభారతి చట్టం: మంత్రి పొంగులేటి✓ ప్రైవేటు స్కూల్ బస్ క్లీనర్ మృతి పట్ల ఆందోళన✓ భద్రాద్రిలో మిర్చి మార్కెట్ ఏర్పాటు చేయాలి ✓ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి:SFI ✓ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం దంపతులు✓ వీధి కుక్కల నియంత్రణకు ఇల్లందులో స్పెషల్ డ్రైవ్ ✓ భద్రాచలంలో ఆక్రమిత ప్రభుత్వ భూమి స్వాధీనం
News February 18, 2025
BREAKING: ఫలితాలు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CHSL-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 2024 APRలో ఈ నోటిఫికేషన్ విడుదలవ్వగా జులైలో టైర్-1, NOVలో టైర్-2 ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 3,954 పోస్టులు ఉన్నాయి. తాజాగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సైట్‌లో పొందుపర్చింది. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామక ప్రక్రియ పూర్తవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News February 18, 2025
NZSR: కళాశాలకు వెళుతున్నానని చెప్పి..!

కళాశాలకు వెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండా పోయిన సంఘటన నిజాంసాగర్ PS పరిధిలో జరిగింది. వెల్గనూర్ వాసి హన్మంత్ రెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఎప్పటిలాగే సోమవారం కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. అటు ఇటు వెతికిన ఫలితం కనిపించలేదు. కుటుంబీకులు మంగళవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.