News April 2, 2024
పొగట్టుకున్న మొబైల్ ఫోన్లు… బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ

పొగట్టుకున్న మొబైల్ ఫోన్లు అతి తక్కువ సమయంలోనే రికవరీ చేసి బాధితులకు మంగళవారం ఉదయం జిల్లా పోలిసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాధిక అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో Lost Mobile Tracking System (LMTS) ద్వార 446 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగింది. దీనితో బాధితులు సంతోషం వ్యక్తపరచి, జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, శ్రీనువాసు, ఉన్నారు.
Similar News
News February 25, 2026
ఎచ్చెర్ల: డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల..

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్‌ను డీన్ డా.అనురాధ విడుదల చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎటువంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్న్ షిప్, వైవా మార్చి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు.
News February 25, 2026
శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రధాన సమస్య..

శ్రీకాకుళం జిల్లాలో వర్షాకాలంలో ప్రధానంగా సీజనల్‌గా డయేరియా కేసులు గ్రామాల్లో కనిపిస్తుంటాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, కలుషితనీరు ఒక సమస్య. నాలుగేళ్ల క్రితం శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT ) ఎస్ఎంపురం క్యాంపస్‌లో 170 మంది విద్యార్థుల వరకు డయేరియాతో బాధపడ్డారు. నీటి పరీక్షలు అనంతరం ఓ బోరును శాశ్వతంగా మూసివేశారు.
News February 25, 2026
శ్రీకాకుళం: డయేరియాకు తాగునీరు కలుషితమే కారణమా?

శ్రీకాకుళం నగరంలో ప్రస్తుతం డయేరియా సమస్యగా మారింది. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను నిలిపివేశారు. తాగునీటి కలుషితమే డయేరియాకు కారణమా అన్న చర్చ సాగుతోంది. నీటి సరఫరా కులాయిల్లోకి డ్రైనేజీ నీరు చేరి ఉంటుందని భావిస్తున్నారు. నీటి నమూనాలను విశాఖ ల్యాబ్‌కు తరలించారు. ల్యాబ్ రిపోర్టు వస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నీరు కలుషితం అతిసార వ్యాధికి కారణమని అధికారుల ప్రాథమిక అంచనా.


