News August 31, 2024
పొదలకూరు: నిమ్మ కిలో రూ.120

జిల్లాలో నిమ్మ ధరలు పెరిగాయి. పొదలకూరు మార్కెట్లో శుక్రవారం కిలో రూ.110 నుంచి రూ.120వరకు ధర పలికింది. ఈ మార్కెట్‌కు కలువాయి, చేజర్ల, రాపూరు, మనుబోలు, సైదాపురం మండలాల నుంచి కాయలు వస్తుంటాయి. ఏప్రిల్‌లో కురిసిన వర్షాలకు పూత, పిందె రాలిపోవడంతో వచ్చిన తక్కువ దిగుబడికి శ్రావణమాసం, వినాయకచవితి పండగల నేపథ్యంలో గిరాకీ పెరిగింది. మరో 3నెలలు నిమ్మ ధరలు ఇలాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
Similar News
News December 9, 2025
రేపటి నుంచి టెట్ పరీక్షలు: నెల్లూరు DEO

రేపటి నుంచి ఈనెల 21 వరకు టెట్-2025 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు ఆన్లైన్‌లోనే పొందవచ్చని పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.
News December 9, 2025
నెల్లూరు: విద్యార్థులకు మరో అవకాశం.!

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ కే.సునీత తెలిపారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఇంకా భర్తీ కాని సీట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు రాకపోయినా సీట్లు పొందే అవకాశం ఉన్నందున ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News December 9, 2025
నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.


