News March 10, 2025
పొదలకూరు నిమ్మ యార్డుకు మంగళవారం సెలవు

హోలీ పర్వదినం సందర్భంగా పొదలకూరులోని ప్రభుత్వ నిమ్మ యార్డుకు మంగళవారం సెలవును ప్రకటిస్తూ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారని, ఇందులో భాగంగా వ్యాపార లావాదేవీలకు సుముఖత చూపించరన్నారు. ఇందుకోసం యార్డ్‌కు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని యార్డ్ పరిధిలోని పరిసర ప్రాంతాల నిమ్మ రైతులు గమనించాలని కోరారు.
Similar News
News March 10, 2025
పోలీస్ గ్రీవెన్స్‌కి 73 ఫిర్యాదులు: ఎస్పీ

నెల్లూరు ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నిర్వహించారు. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రీవెన్స్ కి మొత్తం 73 ఫిర్యాదులు అందాయని ఎస్పీ చెప్పారు. ప్రతీ అర్జీని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News March 10, 2025
మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన బీద రవిచంద్ర

శాసనసభ్యుల కోటా నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన ఆ పార్టీ సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేశ్‌ను కలిశారు. ప్రజాసమస్యలను మండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా రవిచంద్రకు లోకేశ్ అభినందనలు తెలిపారు.
News March 10, 2025
కందుకూరు ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు?

కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహారం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రామాయపట్నం పోర్టు నిర్మాణంలో జోక్యం చేసుకుంటున్న ఆయన వాటా కోసం డిమాండ్ చేసినట్లు ఆంధ్రజ్యోతి సంచలన <