News July 28, 2024

పొదలకూరు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

తమకు ప్రాణహాని ఉందని మమ్మల్ని రక్షించాలంటూ ఓ ప్రేమజంట పొదలకూరు పోలీసులను ఆశ్రయించింది. ప్రేమికులు దిండు మనోజ్, పులి మాధురి మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రేమించుకొని గూడూరులోని నరసింహస్వామి దేవస్థానంలో పెళ్లి చేసుకున్నామన్నారు. తమ తల్లిదండ్రులు ఏ క్షణంలోనైనా దాడి చేసి హత్య చేస్తారన్న భయంతో పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించామన్నారు. ఎస్పీ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని ప్రేమ జంట కోరింది.

Similar News

News November 23, 2025

నెల్లూరు నగర మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్!

image

నెల్లూరు నగర మేయర్ స్రవంతి‌పై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో చర్చించారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న నిర్ణయంపై ఇరువురు నేతల అంగీకారం తెలిపారు. సోమవారం కార్పొరేటర్లందరూ కలెక్టర్‌ను కలిసి నోటీసు ఇవ్వనున్నారు.

News November 23, 2025

నిరుద్యోగ యువతకు ఈ సంస్థ గురించి తెలుసా.?

image

గ్రామీణ నిరుద్యోగ యువతకు వెంకటాచలంలో ఉన్న స్వర్ణభారత్–సోమా సాంకేతిక శిక్షణా సంస్థ ఓ ఆశాదీపంగా నిలిచింది. డిమాండ్ ఉన్న రంగాలలో సాంకేతిక నిపుణులతో ఉచిత శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. గడచిన 14 ఏళ్లలో 5,420 మంది ఇక్కడ శిక్షణ పొందగా 80% మందికి పైగా యువకులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. శిక్షణ పొందే వారికి ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తున్నారు.

News November 23, 2025

కోటంరెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ భేటీ

image

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. మాగుంట లేఔట్‌లోని కోటంరెడ్డి కార్యాలయానికి నారాయణ వచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.