News May 4, 2024

పొదిలి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

పొదిలి మండలం కంబాలపాడు గ్రామ సమీపంలోని సచివాలయం దగ్గరలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తిని స్థానికులు గుర్తించి పొదిలి పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కోటయ్య మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 25, 2026

మార్కాపురం జిల్లా అభివృద్ధికి CM వరాలు కురిపిస్తారా..?

image

మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి CM చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటుచేయగా వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సీఎం జిల్లా అభివృద్ధికి ఎలాంటి వరాలు కురిపిస్తారోనని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News February 25, 2026

ఇవాళ మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

image

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్‌ CMO అధికారులు విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.