News August 7, 2024

పొదిలి: కుమారుడి కంటికి గాయం.. తల్లిదండ్రుల ఆవేదన

image

తమ కుమారుడు రామ్ లక్ష్మణ్‌ను ఉపాధ్యాయుడు బెత్తంలో కొట్టడంతో కంటికి గాయమైందని పొదిలికి చెందిన రమణమ్మ వాపోయారు. దీంతో తమ కుమారుడు చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. శస్త్ర చికిత్స చేయించినా చూపు వస్తోందో లేదో అని వైద్యులు చెప్పారని ఆమె వివరించారు. వైద్యం కోసం ఉపాధ్యాయుడు డబ్బులివ్వడానికి నిరాకరించాడని, దీంతో తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తల్లిదండ్రులు చెప్పారు. తమకు సాయం చేయాలని కోరారు.

Similar News

News December 2, 2025

ఒంగోలు:17 ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతకు నోటీసులు

image

జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. అలాంటి 17 పాఠశాలల యాజమాన్యాలకు డీఈవో కిరణ్ కుమార్ తుది సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. వీటిలో 14 స్కూళ్లలో 40 మందిలోపు, మూడు స్కూళ్లలో 20 మందిలోపు విద్యార్థులున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం 2సార్లు నోటీసులు జారీచేసినా స్కూల్ యాజమాన్యాలు స్పందన లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 2, 2025

ప్రకాశం జిల్లా మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లాలోని మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రైతులకు మేలు చేకూర్చేలా జేసీ గోపాలకృష్ణ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మొక్కజొన్న వినియోగించే ఫ్యాక్టరీస్ యజమానులతో జేసీ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వద్ద ఫ్యాక్టరీ యజమానులు తప్పక పంటను కొనుగోలు చేయాలన్నారు.