News November 12, 2024
పొన్నలూరు: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

పొన్నలూరు గ్రామానికి చెందిన గోసుల సుజాత తన భర్త పెట్టే వేధింపులు భరించలేక ఈ నెల 6న ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెకు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స చేయిస్తుండగా ఆదివారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పొన్నలూరు ఎస్సై అనూక్ సోమవారం కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Similar News
News October 25, 2025
ప్రకాశంను వదలని వాన.. నేడు కూడా దంచుడే.!

ప్రకాశంను వర్షం వదిలేలాలేదని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యుడు ఉదయించని రోజులను జిల్లా ప్రజలు వరుసగా 3 రోజులుగా చవిచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేటి నుంచి ఆగ్నేయ, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందన్నారు. సోమవారంకు ఇది తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
News October 25, 2025
ప్రకాశం: జిల్లాలోని ఇల్లులేని పేదలకు గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లాలోని ఇల్లులేని పేదలకు కలెక్టర్ రాజాబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇల్లులేని పేదలను గుర్తించేందుకు కేంద్రం చేపట్టిన సర్వేకు నవంబర్ 5 వరకు గడువు ఉందని గురువారం కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సచివాలయ, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది ఇంటింటి సర్వే చేయనున్నట్లు, జిల్లా ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News October 25, 2025
ప్రకాశం: విద్యుత్ సమస్య తలెత్తితే కాల్ చేయండి.!

ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ లైన్లు తెగిపడితే తప్పక విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో ఆయన మాట్లాడారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగినా కంట్రోల్ రూమ్ నంబర్ 9440817491కు సమాచారం అందించాలని ఆయన కోరారు.


