News August 19, 2024
పొన్నూరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పొన్నూరు మండలం మామిళ్లపల్లి అడ్డరోడ్డు వంతెన ప్రక్కన సోమవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో పొన్నూరు రూరల్ పోలీసులు కనుగొన్నారు. ఎత్తు సుమారు 4.5, నల్ల జాకెట్టు, మెడలో పసుపు తాడు, పసుపు లంగా ధరించి మృతదేహం సగభాగం కుళ్లిపోయిందని రూరల్ పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతికి గల కారణం తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2024
గుంటూరు: నారాకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏస్ వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2024
ప్రేమ, దయ భావనలతో ఉండాలి: చంద్రబాబు
ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు చంద్రబాబు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సాటివారి పట్ల ప్రేమ, దయ, భావనలతో ఉన్నప్పుడే ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుందని అన్నారు.
News September 16, 2024
గుంటూరు జిల్లాలో పలువురు డీఎస్పీల బదిలీ
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారకాతిరుమల రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విఆర్ లో ఉన్న ఎం.రమేశ్‌ను గుంటూరు ట్రాఫిక్‌కు, గుంతకల్‌లో ఉన్న షేక్ అబ్దుల్ అజీజ్‌ను గుంటూరు తూర్పునకు, పీసీఎస్‌లో ఉన్న ఎం. హనుమంతరావును సత్తెనపల్లికి, ఎమ్మిగనూర్‌లో ఉన్న బి.సీతారామయ్యను గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.