News March 21, 2024
పొన్నూరు: కోడిపందేల స్థావరాలపై దాడులు.. 14 మంది అరెస్ట్

పొన్నూరు మండలం మాచవరం గ్రామం తుంగభద్ర డ్రెయిన్ కట్టపై గురువారం పొన్నూరు రూరల్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై బండ్ల భార్గవ్ ఆధ్వర్యంలో కోడి పందేల స్థావరాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, 6 కోడిపుంజులతో పాటు 16 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తామని ఎస్సై భార్గవ్ మీడియాకు తెలిపారు.
Similar News
News December 4, 2025
అమరావతి: బ్లడ్ టెస్టుల పేరుతో భారీగా వసూళ్లు

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రైవేటు రక్త పరీక్షా కేంద్రాలు రక్తాన్ని పీల్చినట్లు సామాన్యుల నుంచి డబ్బులు లాగేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు రోగనిర్ధారణ టెస్టుల పేరుతో రక్త పరీక్షలు చేయించాలని, కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ ల్యాబ్లకు సిఫార్సు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని, అధికారుల తనిఖీలు కరువయ్యాయని వాపోతున్నారు. మీ ఏరియాలో పరిస్థితిపై కామెంట్ చేయండి.
News December 4, 2025
GNT: మారువేషంలో మార్చూరీని పరిశీలించిన సూపరింటెండెంట్.!

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి మరోసారి మారువేషంలో ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేషన్ తీరును పరిశీలించారు. ఈసారి ఆయన టీషర్ట్, మడత వేసిన ప్యాంటు, మాస్క్, మంకీ క్యాప్ ధరించి మార్చూరీ బయట సాధారణ వ్యక్తిలా ఒక గంటపాటు కూర్చున్నారు. అక్కడే ఉండి, మృతదేహాల బంధువులతో మాట్లాడి, మార్చూరీలోని పరిస్థితులను అధ్యయనం చేశారు.
News December 4, 2025
దుగ్గిరాలలో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు రూ.12,500 గరిష్ఠ ధర పలికింది. యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు కొమ్ముల ధర రూ.8,500 నుంచి రూ.12,500 పలకగా కాయ రకం పసుపు ధర రూ. 8,550 నుంచి రూ.12,500 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. రైతులు యార్డుకు తెచ్చిన పసుపు పంటలో 684 బస్తాలను వ్యాపారులకు విక్రయించారు.


