News April 24, 2025
పొన్నూరు: వీరయ్య చౌదరి హత్య కేసులో అదుపులోకి ఐదుగురు

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తులో ఓ కీలక మలుపు తిరిగింది. బుధవారం పోలీసులు పొన్నూరులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రేషన్ బియ్యం అక్రమ రవాణాతో సంబంధం ఉన్నవారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే ఇదే మాఫియా గతంలో మరో వ్యాపారిని హత్య చేసిన రికార్డు ఉందని సమాచారం. ప్రస్తుతం ఐదుగురు అనుమానితులను ఒంగోలు తరలించి విచారణ చేపట్టారు.
Similar News
News April 24, 2025
గుంటూరు మిర్చి యార్డ్‌లో నేటి ధరలు

గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు గురువారం 90,000 బస్తాలు చేరుకున్నాయి. ఈ మిర్చి ధరలు నాణ్యతను బట్టి భిన్నంగా ఉన్నాయి. 334 రకాల్లో సూపర్ 10 రేట్లు ఇలా ఉన్నాయి. దేశవాళీ రూ.6,000-10,000, డీలక్స్ రూ.10,000-11,000, మద్రాస్ క్వాలిటీ రూ.11,000 పైన ఉన్నాయి. తేజ రకం రెండో కోత (కందుకూరు, పొదిలి) రూ.12,500-రూ.13,000 వరకు పలికింది. 341 రకాలు రూ.7,500-12,000, నంబర్ ఫైవ్ రూ.7,500-రూ.11,000 వరకు ధరలు ఉన్నాయి.
News April 24, 2025
తెనాలి: బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై NTR (D) మైలవరానికి చెందిన అవినాశ్ లైంగిక దాడికి పాల్పడగా వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు విచారించగా వెలుగులోకి రావడంతో ఫిర్యాదు చేశారు.
News April 24, 2025
ANUలో ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల 4/4 మొదటి సెమిస్టర్ ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మొత్తం 638 మంది పరీక్షలు రాయగా 578 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 90.12గా నమోదైంది. రీవాల్యుయేషన్ కోసం మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.