News July 11, 2024
పొరపాటున గడ్డిమందు తాగి మహిళ మృతి

వీరఘట్టం మండలం యూ.వెంకంపేటకు చెందిన వాన రమణమ్మ(55) పొరపాటున గడ్డిమందు తాగి మృతిచెందారు. ఆమె బంధువులు తెలిపిన
వివరాల మేరకు.. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణమ్మ నిత్యం మందులు, టానిక్లు వాడుతున్నారు. ఈ క్రమంలో తాను వాడే టానిక్స్ పక్కనే పంట చేనులో పిచికారీ చేసేందుకు తెచ్చిన గడ్డిమందు ఉండటంతో అనుకోకుండా తాగారు. కుటుంబ సభ్యులు రిమ్స్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు.
Similar News
News December 13, 2025
కంచిలి: రైలు ఢీకొని టెన్త్ విద్యార్థిని మృతి

కంచిలి మండలంలో గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంచిలి పట్టణం బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదైంది.
News December 13, 2025
పొందూరు బ్రాండ్.. అద్భుత ట్రెండ్!

మహాత్మాగాంధీ నుంచి ప్రస్తుత ప్రముఖుల మనసుదోచుకున్న వస్త్రం పొందూరు ఖాదీ. ఎండతాపం నుంచి ఉపశమనం, చల్లదనాన్ని ఇవ్వడం ఈ వస్త్రం ప్రత్యేకత. ఇంతటి ఖ్యాతి గడించిన ఖద్ధరకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ నిన్న అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఈ కీర్తి వచ్చేలా కేంద్రమంత్రి రామ్మోనాయుడు కృషి చేయడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 13, 2025
SKLM: ‘యూరియా నిల్వలను రైతులు వినియోగించుకోండి’

ప్రస్తుత రబీ పంటకు సంబంధించిన మొక్కజొన్న, వరి, ఇతర పంటలకు అవసరమైన యూరియాను జిల్లాకు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాథ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట విస్తీర్ణాన్ని బట్టి మండలాల్లోని రైతు సేవా కేంద్రాలు (ఆర్బీకేలు), పీఏసీఎస్, డీసీఎంఎస్ కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు కొరత లేకుండా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 2379 యూరియా నిల్వ ఉందన్నారు.


