News February 20, 2025
పొరపాట్లకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియను చేయాలి: కలెక్టర్

రీ సర్వే ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్) ప్రకారం పొరపాట్లకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ నిర్వహణపై రెవెన్యూ, సర్వే సిబ్బందికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News March 21, 2025
పాస్టర్ల వేతనాలకు రూ.12.82 కోట్లు విడుదల

రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు వేతనాల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.12.82 కోట్లు విడుదల చేసిందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ మేరకు అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 8427 మంది పాస్టర్లకు నెలకు ఒక్కొక్కరికి రూ.5000 ప్రకారం వేతనం ఇస్తామన్నారు. గతేడాది మే నెల నుంచి పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు.
News March 21, 2025
కర్నూలు జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

రాష్ర్ట ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమైన అన్ని శాఖల జిల్లా అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పురోగతిపై కలెక్టర్ చర్చించారు.
News March 20, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనుకుంటే పొరపాటే అనుకున్నారేమో ఆ రైతులు➤ ఈ నెల 22న ఓర్వకల్లుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక➤ ఆటో బోల్తా.. 10 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు➤ డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్➤ జగన్ ఆదేశాలకు కట్టుబడి ఉంటా: ఆదోని మున్సిపల్ ఛైర్మన్➤ ట్రోఫీలు అందుకున్న జిల్లా నేతలు➤ పాఠశాలలు నిబంధనలు పాటించకపోతే కొరడా తప్పదు: డీఈవో➤ ఈతకెళ్లి ముగ్గురు మృతి